‘యుద్ధం శరణం’ ట్రైలర్ : పరిగెత్తేవాడు పారిపోతున్నట్లు కాదు

yuddamsharanam2808‘పరిగెత్తే ప్రతివాడూ పారిపోతున్నట్లు కాదు’ అంటున్నాడు అక్కినేని నాగచైతన్య. ఆయన హీరోగా నటించిన ‘యుద్ధం శరణం’ మూవీ ట్రైలర్ రిలీజైంది. కృష్ణ ఆర్‌.వి.మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమాలో చైతు సరసన అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. వివేక్‌ సాగర్‌ మ్యూజిక్ అందించిన  ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం(ఆగస్టు-27) రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘మన జీవితాలు ఆనందంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా అద్భుతంగానే అనిపిస్తుంది. అది మన ప్రపంచం. కానీ, ఆ జీవితాల్ని కుదిపేస్తూ ఒక కట్‌ త్రోట్‌ క్రిమినల్‌’ అంటూ చైతన్య మాటలు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఆ క్రిమినల్‌ ఎవరు? తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఎప్పుడూ సంతోషంగా ఉండే ఓ యువకుడి కుటుంబంలో ఉన్నట్టుండి ఎదురైన ఆ సమస్య ఏంటి? అతన్ని జీవితాన్ని ఎలా తల్లకిందులు చేసింది. చివరకు హీరో ఏం చేశాడు. తదితర అంశాల సమాహారమే ఈ ‘యుద్ధం శరణం’ అని టీం చెబుతోంది. శ్రీకాంత్‌ ఇందులో విలన్. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్‌ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy