యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలు

IAF-women-officersయుద్ధ విమాన ఫైలెట్లుగా నియామకానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నలిచ్చింది. కొత్తగా చేపట్టే రిక్రూట్ మెంట్ లో మహిళ ఫైలెట్ల ఎంపిక ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు పురుషులకే యుద్ధ విమానం నడిపేందుకు అవకాశం ఉండేది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఇకపై మహిళలకు కూడా ఆ స్థానం లభించనుంది. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మొదట సెలక్షన్ నిర్వహించి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. అబ్ ఇంట్రో ట్రైనింగ్ తర్వాత జూన్ 2016లో యుద్ధ విమానం నడిపే శిక్షణ ఇస్తారు. వన్ ఇయర్ స్పెషల్ ట్రైనింగ్ తర్వాత జూన్ 2017లో యుద్ధ విమానం కాక్‌పిట్‌లోకి మొదటి బ్యాచ్ మహిళలు అడుగుపెడతారు. ఇప్పటికే 1500 మంది మహిళా ఫైలెట్లు ఎయిర్‌ఫోర్సులో పని చేస్తున్నారు. అందులో 108 మంది హెలికాప్టర్ ఫైలెట్లుగా… ట్రాన్స్‌పోర్ట్ యానిట్లో పనిచేస్తున్నారు.

IAFwomen2017

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy