యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 696 ఖాళీలు

UICCయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-పోస్టు పేరు: అసిస్టెంట్ పోస్టులు
-మొత్తం పోస్టుల సంఖ్య: 696 (జనరల్-414, ఓబీసీ-122, ఎస్సీ-110, ఎస్టీ-50)
రాష్ర్టాలవారీగా ఖాళీలు: తెలంగాణ-20, ఆంధ్రప్రదేశ్-32, మహారాష్ట్ర-107, తమిళనాడు-131, కర్ణాటక-61, కేరళ-38, అండమాన్ నికోబార్ దీవులు-2, అసోం-15, బీహార్-6, ఛత్తీస్‌గఢ్-15, గోవా-3, గుజరాత్-70, హర్యానా-9, హిమాచల్‌ప్రదేశ్-2, జార్ఖండ్-2, మధ్యప్రదేశ్-20, మణిపూర్-1, మేఘాలయ-1, మిజోరం-1, నాగాలాండ్-1, న్యూఢిల్లీ-31, ఒడిశా-10, పుదుచ్చేరి-7, పంజాబ్-13, రాజస్థాన్-30, సిక్కిం-2, త్రిపుర-1, చంఢీగఢ్-2, ఉత్తరప్రదేశ్-37, ఉత్తరాఖండ్-9, వెస్ట్‌బెంగాల్-1

-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. రీజినల్ లాంగ్వేజ్‌లో పరిజ్ఞానం ఉండాలి. అంటే రాయడం, చదవడం మాట్లాడటం వచ్చి ఉండాలి.
-వయసు: 2017 జూన్ 30 నాటికి గరిష్టంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: 14435-32030/- న్యూ పెన్షన్ స్కీమ్, ఇంటర్నెట్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్, వ్యక్తిగత ప్రమాద బీమా, గృహ, వెహికిల్ లోన్ ఇతర అలవెన్సులు కలుపుకొని మెట్రోసిటీ ప్రాంతాల్లో సుమారుగా నెలకు రూ. 23,000/- ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
-ప్రొబేషన్ పీరియడ్: 6 నెలలు
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), పర్సనల్ ఇంటర్వ్యూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ -టైర్ 1: ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. ఈ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (35 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (35 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సెక్షన్‌లో కనీస అర్హత మార్కులను సాధించాలి. ఈ పరీక్షలో ప్రతిభచూపిన వారిని 1:7 నిష్పత్తి (రాష్ర్టాలలో ఉన్న ఖాళీలవారీగా)లో మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, తిరుపతి, రాజమండ్రితో సహా దేశవ్యాప్తంగా మొత్తం 193 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
-ప్రిలిమినరీ ఎగ్జామ్: సెప్టెంబర్ 22
-మెయిన్ ఎగ్జామ్: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.uiic.co.in

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం చెన్నై లో ఉంది. దీన్ని 1938 ఫిబ్రవరి 18న ఏర్పాటు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy