యురీపై మరో ఉగ్ర కుట్ర..భగ్నం చేసిన ఆర్మీ

Army Deputy Commander Harpreet Singhయురీ సైనిక స్థావరంపై గతేడాది తరహాలోనే దాడి చేయడానికి ప్రయత్నించిన ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది భారత సైన్యం. టెర్రరిస్టుల కదలికలను ముందుగానే గమనించి అలర్టైంది . చాకచక్యంగా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని కల్గాం సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను యురీ బ్రిగేడ్ డిప్యూటీ కమాండర్ హర్‌ప్రీత్ సింగ్ సోమవారం (సెప్టెంబర్ 25) మీడియాకు తెలిపారు. శనివారం (సెప్టెంబర్23) రాత్రి సాయుధులైన కొంత మంది ఉగ్రవాదులు బారాముల్లా జిల్లా యురీ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి ప్రవేశించారు. కల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్న సైన్యంపైకి ఆదివారం (సెప్టెంబర్ 24) తెల్లవారు జామున స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

వెంటనే అప్రమత్తమైన ఆర్మీ ఎన్‌కౌంటర్ ప్రారంభించింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పౌరులను సురక్షితంగా తప్పించి, వెంటనే ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లో దూరుతూ.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం వరకూ కొనసాగిన కాల్పుల్లో మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అంతమొందించినట్లు హర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో స్థానికులెవరికీ ఎలాంటి నష్టం  జరగలేదన్నారు.

ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని… హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను తరలిస్తున్నామని సింగ్ తెలిపారు. మరణించిన ఉగ్రవాదుల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టెర్రరిస్టులంతా విదేశీయులేనని… వారి దగ్గర కొన్ని ఐడెంటిటీ కార్డులు కూడా లభించాయన్నారు హర్‌ప్రీత్ సింగ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy