యువకుడిని కట్టేసి.. ఆర్మీ చక్కర్లు

kashmir-stonepelterజమ్ముకశ్మీర్ లో ఓ యువకున్ని ఆర్మీ జీప్ కు కట్టేసి తీసుకెళ్లిన సంఘటన దుమారం లేపింది. ఈ సంఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి ఒమర్ అబ్దుల్లా షాక్ కు గురయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. రాళ్లతో దాడి చేస్తే.. శిక్ష ఈ విధంగానే  ఉంటుందన్న హెచ్చరికలా ఉందన్నారాయన. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బీర్స్వా ప్రాంతంలోని బుడ్గాం జిల్లాలో..  ఓ యువకున్ని ఆర్మీ వాహనం ముందు తాళ్లతో కట్టి.. కాశ్మీర్ వీధుల్లో తిప్పారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారన్నారు ఒమర్ అబ్దుల్లా. వీళ్ల చర్య యువకులను రెచ్చగొట్టేలా లేదా అని ప్రశ్నించారాయన. స్థానిక యుకున్ని వాహనానికి కట్టేసి.. CRPF జవాన్ లు అలా ఊరేగడం ఏంటని ప్రశ్నించారాయన.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy