
నగరంలో అక్టోబర్ 21 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే సదర్ ఉత్సవాల్లో చేవెళ్ల మహరాజే హైలెట్ కానుంది. 2009లో పుట్టిన మహరాజ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు పలుకుతున్నట్లు దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఈ దున్నపోతు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. 2011, 2012, 2016, 2017లో పోటీలకు హాజరై బహుమతులు గెలుచుకుంది.
మహరాజ్ వారీ మెనూ వింటే…
.. రాజభోగాల్లో నిజంగా మహరాజే.. రోజూ ఆలనాపాలనా.. ముగ్గురు మనుషులు
.. రోజూ 5 కిలోమీటర్లు వాకింగ్
.. మూడు సార్లు ఆయిల్ మసాజ్
.. మూడుసార్లు స్నానం
వీర్యంతో కోట్లు సంపాదన
ఒక్క డోస్ వీర్యం ఖరీదు రూ.450. ప్రతి ఏటా మహరాజ్ నుంచి 30 వేల డోస్‌ల వీర్యాన్ని సేకరిస్తున్నారు. దీని విలువ సుమారు కోటిన్నర వరకు ఉంటుందని చెబుతున్నారు యజమాని. త్వరలో దీని సంతానం కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి.