యూకే వేలంలో.. రికార్డు ధర పలికిన మహాత్మాగాంధీ

gandhi-stamp-v6newsజాతిపిత మహాత్మాగాంధీ 1948 నాటి అరుదైన 4 పోస్టల్ స్టాంప్స్  బ్రిటన్ లో రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. రూ. 10 రూపాయల విలువ గల 4 పోస్టల్ స్టాంప్ లు యూకేలో జరిగిన ఒక  వేలంలో రూ. 4.13 కోట్లు పలికింది. భారత్ కు చెందిన ఏ ఇతర పోస్టల్ స్టాంప్ కూడా ఇంత ధరకు అమ్ముడు పోలేదంటున్నారు వేలం నిర్వాహకులు.

ఇండియా.. ఫాదర్ ఆప్ ది నేషన్.. మహాత్మా గాంధీ ముఖచిత్రంతో ఉన్న ఈ లేక్ సర్వీస్ పోస్టల్ స్టాంప్స్ కేవలం 13 మాత్రమే ఉన్నాయని.. అవి కూడా గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 స్టాంప్స్ కలెక్షన్ గ్యాలరీలో ఉండగా.. వాటిలో నాలుగింటిని ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రయివేటు కలెక్టర్ ఆక్షన్ లో కొనుగోలు చేశాడని చెబుతున్నారు స్టాంప్స్ డీలర్ గిబ్సన్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy