అమెరికా అధికారుల ఆదేశాలతోనే ఇబ్బంది

Air-IndiaUSలో రెండు యూనివర్శిటీల విషయంలో ఏర్పడిన గందరగోళంపై క్లారిటీ వచ్చింది. కొందరు విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ అధికారులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతోనే ఈ గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగానే విద్యార్థులను అధికారులు వెనక్కి పంపారని క్లారిటీ ఇచ్చాయి యూనివర్శిటీ వర్గాలు. తమ యూనివర్శిటీలను బ్లాక్ లిస్టులో పెట్టలేదని చెబుతూనే.. ఎయిర్ ఇండియా అధికారులతో మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇబ్బందులు వచ్చాయిని చెప్పాయి. శనివారం కాలిఫోర్నియా వెళ్తున్న స్టూడెంట్స్ ను.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడ్డుకోవడంతో ఈ గందరగోళం ఏర్పడింది.

యూఎస్ లోని సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీల్లో జాయిన్ అయ్యేందుకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన స్టూడెంట్స్ ను ఎయిర్ ఇండియా అధికారులు అడ్డుకున్నారు. దీనిపై అధికారులను విద్యార్థులు ప్రశ్నించడంతో.. తమకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని అధికారుల నుంచి సమాధానం వచ్చింది.

ఈ రెండు యూనివర్శిటీలకు వచ్చే విద్యార్థులకు టిక్కెట్స్ ఇష్యూ చేయోద్దంటూ ఎయిర్ ఇండియా.. ఇంటర్నల్ గా సర్క్యూలర్ జారీ చేసింది. ఈ లెటర్ లో SVU,  NPU లను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు చూపించింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విషయాన్ని వీ6కు చెప్పారు. ఎయిరిండియా ఇష్యూ చేసిన లెటర్ ను కూడా చూపించారు. ఆ యూనివర్శిటీల్లో చేరేందుకు ఇక్కడ్నుంచి వెళ్లిన విద్యార్థులు కొంతమందిని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంలో ఇబ్బంది పడ్డారని.. అందుకే వాళ్లను వెనక్కు పంపంచారని SVU తెలిపింది.

దీంతో వెనక్కి వచ్చిన వాళ్లు SVU, NPU లలో అడ్మిషన్లు పొందనవాళ్లు కావడంతో.. ఎయిరిండియా ఆ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్టు యూనివర్శిటీలుగా పేర్కొంటూ ఇంటర్నల్ సర్క్యూలర్ ఇచ్చి… ఇక్కడ్నుంచి వెళ్లాల్సిన విద్యార్థుల్ని ఆపేశారు. దీనికంతటకీ మరో కారణం అమెరికా తనిఖీలు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు తీవ్రం చేశారు. ఇందులో భాగంగానే సరైన సమాధానం ఇవ్వని స్టూడెంట్స్ ను వెనక్కి పంపారు. ఈ విషయంపై ఇక్కడి స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆ రెండు యూనివర్శిటీల అధికారులు వివరణ ఇచ్చారు. తమ యూనివర్శిటీలు బ్లాక్ లిస్టులో లేవని.. తాము ఎయిరిండియాతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపాయి. అంతవరకు ఎయిరిండియాలో టిక్కెట్స్ బుక్ చేసుకున్న విద్యార్థులు కొన్నిరోజులపాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించాయి. సరైన పత్రాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపాయి. విద్యార్థులు, వాళ్లు పేరెంట్స్ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాయి. మొత్తంమీద ఎయిరిండియా సర్క్యూలర్ తో నెలకొన్న ఆందోళన.. యూనివర్శిటీల వివరణతో సద్దుమణిగింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy