యూపీఏ చివరి బడ్జెట్…

ChidLokSabha295
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఫుల్లుగా కసరత్తు చేశారు చిదంబరం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాన్యుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కేంద్రం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ… ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది. సీమంధ్ర ఎంపీల ఆందోళన మధ్య….ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ముంగిట లాస్ట్ బడ్జెట్ సమర్పణకు యూపీఏ-2 రెడీ అయింది. వరుస కుంభకోణాలతో మసకబారిన యూపీఏ టూ సర్కార్ కు ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో మరమ్మతులు చేయడానికి ఆర్థిక మంత్రి చిదంబరం కసరత్తు పూర్తి చేశారు. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ – మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. కొత్త సర్కారు వచ్చే వరకు అంటే జూన్ వరకు అవసరమైన నిధుల కోసం పెట్టే బడ్జెటే ఓటాన్ అకౌంట్. ఓటాన్ అకౌంట్ అంటేనే నూటికి నూరు శాతం జరుగుబాటు ఖర్చులకు పెట్టే బడ్జెటే. లోక్ సభ ఎన్నికలు తరుముకు వస్తుండడంతో, ఓట్ ఆన్ అకౌంట్ లో సామాన్యుడిపై వరాలు జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే ఛాన్సెస్ లేకపోలేదు. కాంగ్రెస్ వెనకబడిందని సర్వే ఫలితాలు తేల్చి చెబుతున్న నేపధ్యంలో, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధి, మూరు మూల గ్రామాల్లో రోడ్లు , గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సౌకర్యం వంటి వాటిని ఎడాపెడా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, పేద వర్గాలను ఆకట్టుకోవడానికి ఆహార సబ్సిడీలను కూడా అనౌన్స్ చేయవచ్చు. ఎడాపెడా పన్నులతో నానా ఇబ్బందులు పడుతున్న మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ఆదుకోవడానికి చిదంబరం భారీ ఎత్తున కసరత్తు చేసినట్లు అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఎక్సైజ్ సుంకాన్ని పెద్ద ఎత్తున తగ్గించవచ్చు. పన్ను కోతలను ప్రకటించడానికి సర్కార్ కు సరైన సమయం ఇదే. చిదంబరం ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. రైల్వే, ఆరోగ్యం, ఇతర శాఖలకు భారీ స్థాయిలో కేటాయింపులు ఉండొచ్చు. పారిశ్రామిక, వ్యాపార , ఎగుమతి వర్గాలను ఆకట్టుకోవడానికి చిదంబరం కొన్ని రాయితీలను అనౌన్స్ చేయవచ్చు. సహజంగా, ఓటాన్ అకౌంట్ పై ఎవరికైనా చిన్న చూపే ఉంటుంది. కీలక నిర్ణయాలు ఉండవని అందరూ భావిస్తారు. అయితే, మదుపరులు, ఓటాన్ అకౌంట్ ను తేలిగ్గా తీసుకోకూడదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు వరాలేమైనా కురిపిస్తారా? లేదంటే ద్రవ్యలోటు అదుపుతప్పకుండా చూస్తామన్న మాటకు కట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అసలే కుంభకోణాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ సర్కారు బడ్జెట్ ను ఎన్నికల కోణంలోనే ఆవిష్కరించే అవకాశాలూ లేకపోలేదు.

జనరంజక బడ్జెట్ లను ప్రవేశపెట్టడంలో దిట్టగా పేరొందిన చిదంబరం.. తన ఆఖరి బడ్జెట్ ఇన్నింగ్స్ లోనూ మెప్పిస్తారా? లేదంటే ఉసూరుమనిపిస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy