యూపీఏ చేసిందే ఎన్డీఏ చేస్తోందా..?

sheila-dikshit-keralaయూపీఏ హయాంలో అపాయింటైన గవర్నర్లు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పడుతున్నారు. గవర్నర్లు రాజీనామా చేయాలని హోంశాఖ కోరడంతో కొంత మంది రిజైన్ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి రాజీనామా చేయగా.. అదే బాటలో కర్నాటక గవర్నర్ హెచ్.ఆర్. భరద్వాజ్, అస్సాం గవర్నర్ జె.బి.పట్నాయక్ లు కూడా రిజైన్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాము రాజీనామా చేయట్లేదని వారు ప్రకటించారు. యూపీఏ అపాయింటెడ్ గవర్నర్లు తమంతట తామే రిజైన్ చేస్తే గౌరవంగా ఉంటుందన్న బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలతో ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. జోషితో పాటు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ గవర్నర్ ల ప్లేస్ లో ఉంటే తానెప్పుడో రిజైన్ చేసేవాడినని రాజ్ నాథ్ అన్నారు. ఇక అదే బాటలో మరికొందరు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్ రేపు రిజైన్ చేస్తారని సమాచారం. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా పీఎం ను కలవడం తో ఆల్వా కూడా రిజైన్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే గుజరాత్ – కమలా బేణివాల్, మహారాష్ట్ర – శంకర్ నారాయణన్ లు కూడా రిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ లు రిజైన్ చేస్తే సరి లేదంటే వారిని ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంది.

యూపీఏ అపాయింట్ చేసిన గవర్నర్ లకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది. దీంతో కొందరు రాజీనామాకు నో అంటున్నారు. ఢిల్లీ లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో మార్చిలో కేరళ గవర్నర్ గా వెళ్లిన షీలా దీక్షిత్ రిజైన్ చేసేందుకు నిరాకరిస్తున్నారు. తామెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇక హోంశాఖ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ ల విషయంలో అధికార పార్టీకి ఎందుకంత తొందర అని పీసీ చాకో అన్నారు.

2004 లో యూపీఏ కూడా ఇదే పని చేసింది :

2004లో బీజేపీ నియమించిన గవర్నర్ లను యూపీఏ తొలగించడం రాజకీయాల్లో సంచలనమైంది. అధికారంలోకి రాగానే గవర్నర్ లను తొలగించడం, ట్రాన్స్ ఫర్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై అప్పట్లో ఒక ఎంపీ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. ఈ పిటీషన్ పై స్పందించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టింది. గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఇష్టమొచ్చినట్లు తొలగించడం మంచిది కాదని చురకలంటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో యూపీఏ చేసిన పనే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుండటం చర్చనీయం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy