యూపీలో దళితుడి లాకప్ డెత్

custodyఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో ఉన్న అహిర్వాన్ పోలీసు ఔట్ పోస్ట్ లో పోలీసు కస్టడీలో ఉన్న ఓ దళితుడు మృతి చెందాడు. దీంతో ఆందోళనలు చెలరేగాయి. ఈ సంఘటనపై స్టేషన్ ఇన్ ఛార్జి యుగేందర్ సింగ్ తో పాటు ఆ ఔట్ పోస్టులోని 12 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

దొంగతనానికి పాల్పడ్డాడని అనుమానిస్తూ కమల్ వాల్మీకి అనే దళితుణ్ణి, రాజు మిస్త్రీ అనే అతని స్నేహితుణ్ణి పోలీసులు స్టేషన్ కు తీసికెళ్ళి చితగ్గొట్టారు. ఆ దెబ్బలకు కమల్ చనిపోయాడు. విషయం తెలిసి వాల్మీకులు పెద్ద సంఖ్యలో పోలీసు ఔట్ పోస్ట్ పై రాళ్ళు రువ్వి, దాడులకు తెగబడ్డారు. కాన్పూర్-లక్నో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

కమల్ వాల్మికీ మృతదేహాన్ని శివకట్ర గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy