యూపీలో దారుణం : నగల కోసం పెళ్లి కూతురిని చంపేశారు

 

NEWLY MARRIED DEATH JEWELLERYరోజు రోజుకూ దేశంలో అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు పెరిగిపోతున్నాయి. దొంగలు చివరకు కొత్తగా పెండ్లి అయిన జంటను కూడా వదల్లేదు. పెళ్లి కూతురును చంపి.. నగలను, కారును ఎత్తుకెళ్లారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తర ప్రదేశ్, మీరట్ జిల్లాలోని ఢిల్లీ – డెహ్రాడూన్ నేషనల్ హైవేపై చోటు చేసుకున్నది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (ఏప్రిల్-27) రాత్రి పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో సహా.. పెళ్లి బృందం ఘజియాబాద్‌లో జరిగిన పెండ్లి వేడుక అనంతరం వాహనాల్లో బయలు దేరారు. కొత్త పెండ్లి జంటతో పాటు మరో నలుగురు ఓ కారులో వెళ్తున్నారు. ఆ కారును టార్గెట్ చేసిన దుండగులు.. రెండు కార్లలో వచ్చి గన్‌ తో బెదిరించి కారును ఆపారు.

పెళ్లి కూతురు మెడలో ఉన్న నగలను లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో పెళ్లి కూతురు వాళ్లను అడ్డుకుంది. వెంటనే తమ దగ్గర ఉన్న గన్‌ తో పెళ్లి కూతురును కాల్చి చంపి పెళ్లి కొడుకుతో సహా మరో నలుగురిని గాయపరిచి.. త‌న మెడ‌లో ఉన్న నగలు, కారును ఎత్తుకెళ్లారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని ముజఫర్‌ నగర్‌ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం వెతుకుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy