యూపీ తొలివిడత ఎన్నికలకు రంగం సిద్ధం

UP-Electionఉత్తరప్రదేశ్ తొలివిడత ఎన్నికల పోలింగ్ శనివారం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం 15 జిల్లాల్లోని 73 నియోజక వర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్సీ.. కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పోటీ నెలకొంది. 2012లో ఇక్కడి నుంచి బీజేపీ 11 సీట్లను గెలుచుకుంది. బీఎస్పీ 23, ఎస్పీ 24, కాంగ్రెస్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. ఈసారి ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సమాజ్‌ది, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. రాహుల్, అఖిలేష్ కలిసి ప్రచారం చేశారు. ఇక బీజేపీ తరఫున మోడీ, అమిత్‌షా తదితరులు ప్రచారం చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy