యూరప్ కు వలసెళ్లిన వాళ్లు 10 లక్షల మంది

refugees 2015 ‘మీరే శరణు శరణు, కాపాడండి’ అంటూ యూరప్ దేశాలకు లెక్కలేనంతమంది వస్తున్నారు. యూరప్ దేశాలకు ఈ ఏడాదైతే శరణార్థుల తాకిడి ఎప్పుడూ లేనంతగా ఉంది.  మొత్తం 10 లక్షలమందికిపైగా శరణార్థులు యూరప్  దేశాలకు వలస వచ్చారు. దేశం కాని దేశానికి ఎందుకొచ్చారు? ఎవరువాళ్ళంతా?

ఇక్కడ చూస్తున్నారా? ఇది పెద్ద బోటేం కాదు. చిన్న డింగీ. దీనిలోనే 40 మంది కూర్చుని వచ్చేశారు. పిల్లా పాపలతో వందల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేసి వస్తుంటారు వీళ్ళంతా. వచ్చే దారిలో జ్వరమో, జబ్బో వస్తే….అంతే. బతికితే బతుకుతారు, లేదంటే లేదు. అంతే.

refugees వీళ్ళంతా శరణార్థులు. ఒక్కదేశంనుంచి కాదు. వేర్వేరు దేశాలనుంచి ప్రాణాలు అరచేత్తో పట్టుకుని ఎంతో ఆశగా వచ్చారు. టర్కీ, సిరియా, ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఎక్కువమంది వస్తున్నారు. యూరప్ దేశం గ్రీస్ లో ల్యాండయ్యేవాళ్ళే ఎక్కువమంది ఉంటారు. గ్రీస్ లోని లెస్ బోస్ ఐలాండ్ లో దిగుతారు శరణార్థులు. ఎన్నో సమస్యలు ఫేస్ చేసి, సముద్రంలో లాంగ్ జర్నీ చేసి బిక్కుబిక్కుమంటూ వచ్చేవాళ్ళకి ఈ ఐలాండ్ లో అడుగుపెట్టగానే ఒక్కసారిగా హుషారు వచ్చేస్తుంది. హేపీగా గెంతులేస్తారు.

రకరకాల కారణాలవల్ల వలస వస్తున్నారు. సిరియా, ఇరాక్, టర్కీ దేశాలనుంచి అయితే ఒకటే కారణం. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు సంస్థ దుర్మార్గాలు భరించలేకపోవడమే. ఆఫ్గనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి బతుకుతెరువుకోసం వస్తుంటారు. సిరియా దాదాపుగా ఐఎస్ఐఎస్ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో అక్కడినుంచి లక్షలాదిమంది తప్పించుకుని వచ్చి ఎలాగోలా ఏదో బోట్ ఎక్కేస్తున్నారు. లెస్ బోస్ ఐలాండ్ లోనే వీళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సిరియానుంచి పారిపోయి వచ్చేవాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి 6 నెలలు దేశంలో ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. మిగతావాళ్ళకి నెలరోజులే పర్మిషన్. లెస్ బోస్ నుంచి గ్రీస్ లోని మిగతా ప్రాంతాలకు కానీ, జర్మనీకి కానీ వెళ్తారు. ఆశ్రయం ఇస్తామని ముందుకొచ్చిన ఏ దేశానికి వెళ్ళడానికైనా వీళ్ళు రెడీ.

Greece Migrantsశరణార్థులు ఉండడానికి టెంపరరీగా చిన్న చిన్న టెంట్లు ఇస్తారు. వాళ్ళకి భోజనాలూ ఏర్పాటుచేస్తారు. అయితే, కడుపునిండా భోజనం ఉండకపోవచ్చు. కానీ ఆకలి కొంతయినా తీరేలా ఉంటుంది. పిల్లాపాపలతో ఆ టెంట్లలో ఉంటున్న శరణార్థులను చూస్తే జాలి వేస్తుంది. ఎన్నాళ్ళు యూరప్ లో ఉండనిస్తారో, తమ భవిఫ్యత్తు ఏమిటో తెలియదు వీళ్ళకి. అయినా సరే, ఎముకలు కొరికే చలిలో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఐఎస్ఐఎస్ ఆర్గనైజేషన్ ను అంతం చేస్తేనే కానీ, ఈ వలసలు ఆగవు. లక్షల్లో వలస వస్తుండడంతో ఇప్పటికే యూరప్ లో చాలా దేశాలు శరణార్థులకు పర్మిషన్ ఇవ్వట్లేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy