యోగా డే : గిన్నిస్ రికార్డ్ కు రెడీ

yoga recordఅంతర్జాతీయ యోగా దినోత్సవానికి (జూన్ 21) రెడీ అవుతోంది ప్రపంచం. ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో మూడో ఏడాది కూడా విజయవంతంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి ఆయా దేశాలు. బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రపంచం మొత్తం యోగాతో సందడి చేయనుంది. దేశంలోని మైసూర్ నగరం మాత్రం అరుదైన రికార్డ్ కోసం చకచకా పనులు సాగుతున్నాయి. ఒకే వేదికలో ఎక్కువ మంది యోగా చేయటం ద్వారా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మైసూర్ ప్యాలెస్ లోని రేస్ కోర్స్ దీనికి వేదిక. ఉదయం ఐదు గంటలకే మొత్తం ఏడు గేట్లు ఓపెన్ చేస్తామని ప్రకటించారు మైసూర్ ప్యాలెస్ బోర్డ్ అధికార ప్రతినిధి డీసీ రణదీప్. తెల్లని టీ షర్ట్, ప్యాంట్ (మగాళ్లు), మహిళలు చుడీదార్ ధరించి రావాలని తెలిపారు. నిబంధనలు కచ్చితంగా ఫాలో కావాలన్నారు. శ్రద్ధగా చేయాల్సి ఉంటుందని.. కనీసం 10శాతం మంది అయినా కచ్చితంగా అన్ని ఆసనాలు వేయాల్సి ఉంటుందన్నారు నిర్వాహకులు. అప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు. పోలీస్ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతి గేటు దగ్గర ఒక్కొక్కరికీ ఒక్కో బార్ కోడ్ టికెట్ ఇష్యూ చేస్తున్నారు. దీని ద్వారా ఎంత మంది హాజరు అయ్యింది తెలుస్తుంది. యోగా డేతోపాటు గిన్నిస్ రికార్డ్ కోసం ఇప్పటికే మైసూర్ ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy