యోగి డెసిషన్ : 25 లక్షల మంది రోడ్డున పడ్డారు

1490566195-6375ఉత్తరప్రదేశ్‌లో మాంసం దుకాణాల మూసివేతతో 25 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. కబేళాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడానికి వ్యతిరేకంగా లక్నోలో మాంసం వ్యాపారులు దుకాణాలు మూసేసి నిరవధిక ఆందోళనకు దిగారు. బీఫ్‌ కొరత వల్ల మటన్, చికెన్‌ వంటకాలకు ప్రసిద్ధి చెందిన టండే, రహీం లాంటి సుప్రసిద్ధ దుకాణాలు కూడా లక్నోలో మూతపడ్డాయి. లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బకొడుతున్న ప్రభుత్వ చర్యపై మాంసం అమ్మకం దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న 140 కబేళాలను, 50వేల మాంసం దుకాణాలను మూసివేశారు.  ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు.

ఇదే అంశంపై పార్లమెంట్ లోనూ మార్చి 27 ఎంపీలు డిబేట్ చేశారు. మాంసం దుకాణాల మూసివేతతో 15 వేల కోట్ల బీఫ్ ఎగుమతులు పడిపోయాయన్నారు పార్లమెంట్ సభ్యులు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. అక్రమంగా ఉన్న దుకాణాలను మాత్రమే యూపీ సర్కారు మూసివేయిస్తోందని చెప్పారు.

కబేళాలు మూసివేయాలని అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో పలు కబేళాలను అధికారులు మూసివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాటిని మాత్రమే మూసేశారని,  లైసెన్సు ఉండి పారదర్శంగా వ్యాపారం చేసుకునేవారికి ఎటువంటి ఇబ్బంది ఉందని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్.

చట్టబద్ధం చేసుకోవటానికి వీలు కల్పించాలి: ఒవైసీ

ఉత్తరప్రదేశ్‌లోని పశువధ శాలలకు కొంత గడువు ఇచ్చి మూసివేయాలని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్నారంటూ మూసివేయటం సరికాదన్నారు. మొన్నటి వరకు అక్కడ అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ ప్రభుత్వం యథేచ్ఛగా స్లాటర్‌ హౌజ్‌లు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పారు ఒవైసీ. చట్టబద్ధం చేసుకోవటానికి ఆయా వధశాలల యజమానులకు వీలు కల్పించాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రస్తుతం మూసివేయిస్తున్న వాటిలో నిబంధనల మేరకు పనిచేస్తున్న వధశాలలు కూడా ఉన్నాయని తెలిపారు. పెద్ద మొత్తంలో నల్లధనం కూడబెట్టిన కుబేరులు ముందుకు వచ్చి, స్వచ్ఛందంగా సొమ్మును వెల్లడించేందుకు అవకాశం ఇస్తున్న సర్కారు.. వధశాలలకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఒవైసీ. దేశం నుంచి ఏటా రూ.26వేల కోట్ల విలువైన గేదెల మాంసం విదేశాలకు ఎగుమతి అవుతుండగా అందులో సగం కేవలం ఉత్తరప్రదేశ్‌ నుంచి మాత్రమే వెళుతోందని వివరించారు. ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేకుండా తీసుకున్న ఈ చర్య వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతోందని చెప్పారు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy