యోగి డ్రైవర్ కు భారీ జరిమానా

yogi-car-driverఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డ్రైవర్ విధినిర్వహణ సమయంలో గుట్కా తిన్నాడని ఫైన్ వేసింది యూపీ గవర్నమంట్. అది సీఎం అయినా.. ఆయన డ్రైవరైనా చట్టం తనపని తాను చేసుకుపోతుందని నిరూపించారు ఉత్తర్ ప్రదేశ్ అధికారులు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కారు డ్రైవర్‌ డ్యూటీలో గుట్కా నమిలి రోడ్డు పై ఉమ్మి వేశాడని రూ.500 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. విధి నిర్వహణలో ఉండగా చట్టాన్ని ఉల్లంఘించాడని ఈ ఫైన్‌ కట్టించుకున్నారు అధికారులు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్‌ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. పదవిలోకి రాగానే సీఎం ఆదిత్యనాత్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం ఆదిత్యనాత్. ఆయన కారు డ్రైవరే పాన్‌ మసాలా నములుతూ దొరికడంతో ఖంగుతిన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పాన్ మసాలాలు నమలడం మానేయాలని.. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని, రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చినా లాభం లేకపోయిందంటున్నారు విమర్శకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy