రంజాన్ తొలిరోజు.. ఆఫ్ఘాన్ లో నరమేధం

taliban-afghanistanఆఫ్ఘనిస్తాన్ లో బీభత్సం సృష్టించారు ముష్కరులు. పవిత్ర రంజాన్ మాసం తొలిరోజే నరమేధం సృష్టించారు. సూసైడ్ కార్ బాంబు దాడిలో 18 మంది చనిపోయారు. తూర్పు ఆఫ్ఘాన్ నగరమైన ఖోస్ట్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు దాడితో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రావిన్సులో అమెరికా దళాలతో కలిసి పనిచేస్తున్న ఆఫ్ఘాన్ సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే తాలిబన్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాందహార్‌లో మిలటరీ బేస్‌పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 15 మంది సైనికులను చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy