రంజాన్ రోజూ జమ్ము కశ్మీర్ లో ఘర్షణలు

kashmirజమ్ము కశ్మీర్ లో రంజాన్ రోజు కూడా ఘర్షణలకు పాల్పడ్డారు ఆందోళన కారులు. కశ్మీర్ లోని పలు చోట్ల అల్లర్లతో అట్టుడకిపోయింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు పోలీసులుభాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను పురస్కరించుకుని సోమవారం (జూన్26) ముందుజాగ్రత్త భద్రతాచర్యగా కశ్మీర్‌లోని కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని ఈద్ఘా మసీదు దగ్గర కూడా ఆంక్షలు ఉండగా.. స్థానిక ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు వచ్చారు. నమాజ్‌ చేసిన తర్వాత ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ ఉపయోగించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఇక్కడ మూగిన ఆందోళనకారులు చెదిరిపోయారు. ఈ ఘర్షణల్లో పదిమంది గాయపడ్డారు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ పట్టణంలోనూ దాదాపు గంటసేపు ఘర్షణలు జరిగాయి. జంగ్లత్‌ మండీ దగ్గర ఈద్‌ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపూర్‌, పఠాన్‌ పట్టణాల్లోనూ ఘర్షణలు జరిగినట్టు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy