HCA టీమ్ ని ఫైనల్స్ కి తీసుకెళ్లడమే లక్ష్యం : వివేక్ వెంకటస్వామి.

VIVEK RANJIహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ ని రంజీ ఫైనల్స్ కి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు HCA ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అండర్-16, అండర్-19 సమ్మర్ క్యాంప్ లని సోమవారం (మే-21) పరిశీలించారు. జూన్ ఫస్ట్ నుంచి 2 డే, 3 డే లీగ్ నిర్వహిస్తున్నామన్నారు వివేక్. మొయిన్ ఉద్ దౌల, బుచ్చి బాబు టోర్నమెంట్, అండర్-16 లీగ్ లో HCA జట్టు మంచి ప్రతిభ కనబర్చిందని చెప్పారు. తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న వరుణ్ గౌడ్ ని ఈ ఏడాది అండర్ – 19 జట్టు కు కెప్టెన్ గా, మరో ఐదుగురు ప్లేయర్స్ కు టీంలో చోటు కల్పించామన్నారు. దేశంలోనే HCA జట్టుని నంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు వివేక్ వెంకటస్వామి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy