రండి.. రండి.. దయచేయండి.. నితీశ్ కు అమిత్ ఆహ్వానం

amith-nithishఎన్డీఏ కూట‌మిలో క‌ల‌వాలంటూ జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు ఆహ్వానం అందించారు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా. శుక్ర‌వారం ప్ర‌ధాని మోడీతో బీహార్ సీఎం నితీశ్ క‌లిసిన త‌ర్వాత ఈ ఆహ్వానం అందింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మిలో చేరే అంశాన్ని పాట్నాలో జ‌రిగే స‌మావేశంలో జేడీయూ ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్‌, కాంగ్రెస్ పార్టీల‌కు జూలై 26న గుడ్‌బై చెప్పిన నితీశ్ ఆ త‌ర్వాత బీజేపీతో క‌లిసి రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ త‌ర‌పున మొత్తం 12 మంది పార్ల‌మెంట్ స‌భ్యులు ఉన్నారు. లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు, రాజ్య‌స‌భ‌లో ప‌ది మంది ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy