రకుల్ చెడుగుడు : వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించు

rakulఎవరైనా కామెంట్ చేస్తే ఏంటని కనీసం ఓ సెకన్ అయిన ఆలోచిస్తాం.. ఏంటా అని. అలా కాకుండా ఏమన్నాడో కూడా తెలియకుండా పగలబడి నవ్వేస్తే దానర్ధం ఏంటీ.. సమర్ధించినట్లే కదా. హీరో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారంలో ఇప్పుడు అచ్చంగా ఇలాగే జరిగింది. రారండోయ్ వేడుకచూద్దాం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అమ్మాయి మనశ్శాంతికి హానికరం అన్న హీరో కామెంట్ పై మీరేమంటారు అని చలపతిరావును యాంకర్ అడుగుతుంది. దీనికి ఆయన చెప్పిన సమాధానం తర్వాత చైతూ, రకుల్ పగలబడి నవ్వారు. అప్పుడే కెమెరా వాళ్లవైపు వెళ్లటం.. హైలెట్ కావటం జరిగిపోయింది. దీంతో నెటిజన్లు కూడా చలపతిరావు ఆడవాళ్లను అన్నేసి మాటలు అంటుంటే.. సపోర్ట్ చేస్తారా అంటూ దుమ్మెత్తిపోశారు. దీనిపై హీరోహీరోయిన్స్ స్పందించారు. వివరణ ఇచ్చారు. వాళ్లేమన్నారో వారి మాటల్లోనే..

నాగచైతన్య : ఆడవాళ్లను గౌరవించడం నా జీవన విధానం. టీవీలో మీరు చూసిన రియాక్షన్స్ నేను చలపతిరావు చేసిన కామెంట్స్ కి అని అనుకుంటున్నారా? అస్సలు కాదు.

రకుల్ ప్రీత్ సింగ్ : చలపతిరావు కామెంట్స్ పై ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమాపణలు. ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నాను. ఆయన మాట్లాడిన విషయం అక్కడే తెలిసుంటే స్టేజ్ మీదనే కౌంటర్ ఇచ్చేదాన్ని. ఆయన మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ వయస్సుకు తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇలాంటి మాటల వల్ల మీ చుట్టు పక్కల ఉండే వాళ్లకు కూడా మర్యాద ఉండదు. ఇండస్ట్రీలో మీ లాంటి పెద్దలు ఇలా మాట్లాడటం వల్ల కొత్తగా వచ్చిన వాళ్లు ఎటువంటి స్పందన ఇవ్వరు. కానీ ఈ విషయంలో నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. మీ పరిధిని బట్టి మాట్లాడితే మంచిది. నేను, చైతూ అక్కడ నవ్వింది ఆ విషయంపై కాదు. టీవీలో ఐదు నిముషాలు లేటుగా టెలికాస్ట్ అవుతుందని స్పష్టం చేసింది.

సమంత కూడా వీళ్లిద్దరి మాటలకు మద్దతు తెలుపుతూ రీట్వీట్ చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy