రక్త సంబంధం : ఈ చెల్లెలి ఆశీర్వాదం అమోఘం

3 - Copyఅన్నా చెల్లెలు అనుబంధం.. ఆప్యాయతను మాటల్లో చెప్పలేం. ఒకరి కోసం ఒకరుగా.. వాళ్ల అనురాగాన్ని చేతల్లో చూపించటం కష్టమే. దీపావళి తర్వాత వచ్చే విధియ రోజున దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల పండుగ జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ పండుగకు పిలుస్తారు. పశ్చిమబెంగాల్లో భాయ్ దూజ్ అంటారు. అక్టోబర్ 21వ తేదీన ఈ పండుగ బెంగాళీలు ఘనంగా జరుపుకున్నారు. సోదరులు.. సోదరిమణులు ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని.. భోజనం చేసి వస్తారు. ఓ ఘటన మాత్రం దేశవ్యాప్తంగా కన్నీళ్లు తెప్పించింది. ఫేస్ బుక్ సైతం.. బెస్ట్ ఫొటోస్ గా గుర్తింపు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ హూగ్లీ ప్రాంతంలోని చించురా ప్రాంతంలో తిలక్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు. పెద్ద వాళ్లు అయ్యారు. అమ్మాయికి అనారోగ్యం కారణంగా చేతులు పని చేయటం లేదు. నడవలేని పరిస్థితి. కొన్నేళ్లుగా వీల్ చైర్ కే పరిమితం అయ్యింది. అయినా సరే భాయ్ దూజ్ పండుగ రోజు తన అన్నయ్య చందన్ తిలక్ కు ఆశీర్వాదం ఇచ్చింది. తన కాలి వేలితో తిలకం దిద్దింది.. కాళ్లతోనే నెత్తిన ఆశీర్వాదం ఇచ్చింది. చెల్లెలు నుంచి ప్రతి ఏటా ఇలాగే విషెస్ తీసుకుంటానని చెబుతున్నాడు చందన్. తను నడవలేకపోవచ్చు.. మాట్లాడలేకపోవచ్చు.. అయినా ఆమె ఇచ్చే ఆశీర్వాదం ఎంతో ముఖ్యం అంటున్నాడు చందన్.

చేతులు పనిచేయలేకపోయినా.. నాకు ఆశీర్వాదం ఇవ్వటానికే ఆ దేవుడు నా సోదరి కాళ్లు పని చేసేలా చూశాడని కన్నీళ్లతో చెబుతున్నాడు. ఈ ఫొటోలను చందన్ కజిన్ ఫేస్ బుక్ పోస్ట్ చేశాడు. దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఫేస్ బుక్ సైతం.. బెస్ట్ భాయ్ దూజ్ ఫొటోస్ గా గుర్తింపు ఇవ్వటంతో మరింత మందికి చేరువ అయ్యింది. భాయ్ దూజ్ పండుగలో ఇలాంటి ఆశీర్వాదం చూడటం ఇదే తొలిసారి.. అన్నాచెల్లెల్ల అనుబంధానికి ఇది ప్రతీక.. రక్త సంబంధం అంటే ఇదే అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

শুভ ভাইফোঁটা ।

Samrat Basu 发布于 2017年10月21日周六

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy