రక్షణలేకుండానే: ఆటో ట్రాలీలో రూ.40 కోట్లు

cashభారీ బందోబస్తు…పటిష్టమైన లాకర్లున్న బ్యాంకులనే కొల్లగొట్టి దొంగలు డబ్బును దోచుకుంటున్నారు. అలాంటిది.. మన డబ్బు కాదు కదా అనుకున్నారో ఏమే …ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా బహిరంగంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కోట్ల రూపాయలను ఓపెన్ ట్రాలీలో తరలించడానికి రెడీ అయ్యారు బ్యాంకు అధికారులు. ఈ ఘటన గురువారం(మే-10) నల్లగొండ లో జరిగింది.

గడియారం సెంటర్ లో ఉన్న SBI ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు..ఇతర బ్రాంచీలకు టాటా ఏస్ వాహనం ట్రాలీలో రూ.40 కోట్లను తరలించడానికి సిద్ధపడ్డారు. అది ఎలాంటి సెక్యూరీ లేకుండానే. విషయం తెలుసుకున్న స్థానిక బ్యాంకు దగ్గరకు వచ్చి  అడ్డుకున్నారు పోలీసులు. రూ.40 కోట్లను గ్రామీణ వికాస్‌ బ్యాంకుకు తరలించేందుకు ట్రాలీ ఆటోలో నోట్ల కట్టలు సర్దారు. నోట్లు బయటకు కనిపించకుండా కనీస ఏర్పాట్లు కూడా చేపట్టలేదు. భారీ మొత్తంలో డబ్బులు కన్పించడంతో వందలాది మంది ఆసక్తిగా చూశారు.

దీనిపై గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాషా, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు బ్యాంకు దగ్గరకు వెళ్లారు. భారీ మొత్తంలో నగదును పంపించేటప్పుడు బ్యాంకు సెక్యూరిటీ వాహనంలో తరలించాలని తెలిపారు. సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప ఇలా పంపించడం సరికాదని అధికారులకు సూచించారు. తర్వాత పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును గ్రామీణ వికాస్‌బ్యాంకుకు తరలించారు. బ్యాంకు అధికారులు మాత్రం..ప్రత్యేక వాహనం లేకపోవడం కారణంగానే అత్యవసరం సమయంలో ఇలా చేయాల్సి వచ్చిందంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy