రగులుతున్న సరిహద్దు : భారత్ – చైనా వార్ టెన్షన్

indi-china-tensionడ్రాగన్ – టైగర్ మధ్య మాటల యుద్ధం. సరిహదుల్లో వార్ టెన్షన్. మాటలు దాటి.. సైనికుల ఘర్షణ జరుగుతోంది. బోర్డర్ లోని 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం విషయమై రెండు దేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. సమస్యకు పరిష్కారం దొరక్కపోతే భారత్ పై చైనా యుద్ధానికి కూడా దిగొచ్చు అని ఆదేశ విశ్లేషకులు హెచ్చరించటం చూస్తుంటే.. పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో అర్థం అవుతుంది. సిక్కిం రాష్ట్ర సెక్టార్ లోని డోకా లా ప్రాంతం భూటాన్ పరిధిలోకి వస్తుందని.. అక్కడ చైనా రోడ్డు నిర్మించడం అంటే రెచ్చగొట్టటమే అంటోంది భారత్.

డోకా లా అంటే ఏంటీ :

డోకా లా అనేది ఓ ప్రాంతం. సిక్కిం సెక్టార్ లో భూటాన్ పరిధిలోకి వస్తుంది. ఈ భూభాగం ఎప్పటి నుంచో భారత్ పర్యవేక్షణలో ఉంది. ఈ ప్రాంతంపై చైనా కన్నేసింది. కుట్రలు పన్నింది. కీలకమైన డోకా లా చైనా స్వాధీనం చేసుకుంటే టిబెట్ వైపు ఉన్న చుంబీ లోయపై చైనా ఆధిపత్యం సాధించినట్లే. భారత్ – భూటన్ మధ్య జరిగే ప్రతి కదలిక చైనా కనుసన్నల్లోనే ఉంటుంది. టిబెట్ పైనే కాకుండా ఇటు భారత్ – అటు భూటా సరిహద్దుపై డ్రాగన్స్ పెత్తనం పెరుగుతుంది. అందుకే ఈ ప్రాంతంపై పదేపదే చైనా యుద్ధానికి కాలుదువ్వుతుంది. 2008 నవంబర్ లో ఒకసారి భారత్ సైనికుల గుడారాలను కూడా కూల్చివేసింది. 2017, జూన్ 6న బుల్డోజర్లతో భారత బంకర్లను కూడా ధ్వంసం చేసింది. నెల రోజులుగా ఉద్రిక్తత నెలకొంది.

భారత్ – చైనా మటల యుద్ధం :

రోజురోజుకు రెండు దేశాల మధ్య బోర్డర్ టెన్షన్ పెరుగుతుంది. మాటలు హద్దు మీరాయి. చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోండి అంటూ 1962 యుద్ధాన్ని దెప్పిపొడుస్తూ చైనా మాటల యుద్ధానికి తెరతీసింది. దీనికి సమాధానంగా నేటి భారత్.. 1962 నాటిది కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చైనాకు అదేస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మళ్లీ చైనా స్పందించింది. నిజమే చెప్పారు.. అలాగే ఇప్పుడు చైనా కూడా వేరు అని చైనా విదేశాంగ మంత్రి గెంగ్ షువాంగ్ రిప్లయ్ ఇచ్చారు. 1890లో బ్రిటన్, చైనా ఒప్పందంలో భాగంగా డోకా లా ప్రాంతం మాదే అని చైనా వాదిస్తోంది. దీన్ని అప్పటి ప్రధాని నెహ్రూ కూడా అంగీకరించారని చెబుతోంది. భూటాన్ భూభాగంలోకి భారత్ ప్రవేశించి.. అనవసరంగా రెచ్చగొడుతుంది అంటూ చైనా పదేపదే ఒంటెద్దు పోకడలకు పోతోంది.

చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక

చైనా సముద్రంలో అమెరికా క్షిపణి విధ్వంసక యుద్ధనౌకను మోహరించడాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందని చైనా తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో నిర్మించిన కృత్రిమ దీవి ట్రిటన్‌కి సమీపంలో యుద్ధనౌకను మోహరించడాన్ని రెచ్చగొట్టే చర్యగా చైనా చెబుతోంది. ఈ ప్రాంతంలో విదేశీ యుద్ధ నౌకలు ప్రవేశించటాన్ని దురాక్రమణగా అభివర్ణించింది. చైనా చట్టాలకు వ్యతిరేకం అని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది చైనా. పదేపదే యుద్ధ నౌకలు, విమానాలు ఈ ప్రాంతానికి వస్తూ.. చైనా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించటమే అంటోంది డ్రాగన్ దేశం. అమెరికా ఇలా యుద్ధ నౌకలను మోహరించటం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాగే చేసింది.

భారత్ పై ఆడిపోసుకుంటున్న చైనా :

అమెరికా, చైనా సంబంధాలపై వ్యతిరేక శక్తుల ప్రభావం ఉందని చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్.. నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల క్రమంలో ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఫ్లోరిడా భేటీ మంచి ఫలితాలను ఇచ్చిందని.. అయితే కొన్ని వ్యతిరేక శక్తుల ప్రభావం రెండు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తోందని జింగ్ పింగ్ ట్రంప్ కు స్పష్టం చేశారు. అమెరికా క్షిపణి విధ్వంసక యుద్ధనౌక.. దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన వెంటనే వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy