రచయితగా మోడీ

MODI1ప్రధాని నరేంద్రమోడీ రచయితగా అయ్యారు. యూత్ కోసం ఓ పుస్తకం రాయాలని నిర్ణయించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, పరీక్షల తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలను ఆయన రాయబోయే పుస్తకంలో ప్రస్తావించనున్నారు. పదవిలో ఉండగా  పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు.

ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం పలు భాషల్లో మార్కెట్‌లోకి వస్తుందని పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ (పీఆర్‌హెచ్‌) ఇండియా పబ్లిషర్లు తెలిపారు. దీనికి స్వచ్ఛంద సేవాసంస్థ బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ సాంకేతిక విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా టెన్త్, ఇంటర్ చదివే  విద్యార్థులకు ఉపయోగపడే అంశాలెన్నింటినో మోడీ రాయనున్నారు. మార్కుల కంటే విజ్ఞానం ఎందుకు ముఖ్యం…భవిష్యత్తు బాధ్యతను ఎలా స్వీకరించాలనే విషయాలను ప్రస్తావిస్తారు. దీని ద్వారా పరీక్షల్లో వారికి అండగా ఉండి, స్నేహితుడిగా మారాలని ప్రధాని ఆశిస్తున్నారని పబ్లిషర్లు చెప్పారు.

‘మన్‌ కీ బాత్‌’కు మంచి స్పందన వస్తున్న క్రమంలో యువతకు ప్రయోజనం చేకూర్చే అంశాలను ఓ పుస్తక రూపంలో తేవాలని మోడీ అనుకున్నట్లు పీఆర్‌హెచ్‌ సీఈఓ గౌరవ్‌ శ్రీనగేష్‌ తెలిపారు. ‘నా హృదయానికి దగ్గరగా ఉన్న అంశంపై పుస్తకం రాయాలనుకున్నానని.. ఆ ఆలోచనకు రూపమే యువతరం సారథ్యంలోని రేపటి భారత్‌పై పుస్తకం’ అని ప్రధాని చెప్పినట్టు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన విషయాలతో ప్రధాని పుస్తకం రాయడం చాలా అరుదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పీఆర్‌హెచ్‌ ఇండియా వాణిజ్య విభాగం చీఫ్‌ ఎడిటర్‌ మిలీ ఐశ్వర్య తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy