రుణమాఫీపై రైతు గుస్సా…

adb raithu-image కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై రైతులు గుస్సా అవుతున్నారు. 2013 జూన్ నుంచి కాకుండా అంతకు ముందు నుంచి ఉన్న రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీన్ని వెంటనే మార్చాలంటూ తెలంగాణ రైతులు ఆందోళనకు దిగారు. మొత్తం తెలంగాణ అంతటా రైతులు నిరసనలు చేపట్టారు. నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ లలో రైతులు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు షరతులు విధించటాన్ని నిరసిస్తూ.. జిల్లాలో నిరసనలు చేపట్టారు అన్నదాతలు.
మరోవైపు ప్రతిపక్ష నేతలు సైతం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం మాటమార్చిందని విమర్శిస్తున్నారు. మాఫీపై ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకే కట్టుబడి ఉండాలని.. షరతులు పెట్టి అన్నదాతలకు అన్యాయం చేయొద్దని పలువురునేతలు కోరుతున్నారు. రైతు రుణమాఫీపై వెనక్కు తగ్గితే ఉద్యమబాట పడతామని కాంగ్రెస్ శాసససభా పక్షనేత జానారెడ్డి హెచ్చరించారు.
రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మేనిఫెస్టోలో ఓ రకంగా… ఆచరణలో మరోరకంగా వ్యవహరించవద్దన్నారు.
రుణమాఫీలపై కండీషన్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆడిన మాట తప్పి అపఖ్యాతి కొనితెచ్చుకోవద్దని సర్కారుకు హితవు పలికారు.
eetela-rajendar-finance-ministerదీంతో పునరాలోచనలో పడింది సర్కార్. రుణమాఫీపై డామేజ్ కంట్రోల్ అయ్యే పరిస్థితి రావటంతో.. స్టార్టింగ్ స్టేజ్ లోనే స్ట్రగుల్ ఎందుకనే నిర్ణయానికొచ్చింది. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో.. నష్టనివారణ చర్యలకు దిగింది. అందుబాటులో ఉన్న సమాచారంతోనే రుణ మాఫీ లెక్కలు చెప్పామని.. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని స్పష్టం చేసింది. అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. వారం రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తామని.. ఇప్పటికిది ప్రాథమిక అంచనా మాత్రమే అని ఆర్థిక మంత్రి ఈటెల సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఎండ్ వాయిస్: అయితే ఈటెల ఎంత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా రైతులు మాత్రం ఊరుకోము అంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో తెలంగాణను వేడెక్కిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy