రన్నింగ్ ట్రైన్ తో సెల్ఫీలు.. వద్దన్నా వినని జనం

Matlock Bath - Children sit on rails while mother takes picture.JPGసెల్ఫీలు… మనుషుల్ని పిచ్చోల్ని చేస్తున్నాయి. ప్రాణం కంటే సెల్ఫీలపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. ఆ మాయలో ప్రాణాలు పోగొట్టుకొంటున్నవారు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఎన్ని ఉదాహరణలు.. ఎన్ని సాక్ష్యాలు కళ్లకు కనపడుతున్నా.. వినపడుతున్నా… జనం మాత్రం ఆ పిచ్చి నుంచి బయటపడటం లేదు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ స్టేషన్ పేరు మ్యాట్ లాక్ బాత్ స్టేషన్.. ఇక్కడ చూడండి.. పిల్లాపాపలతో పెద్దలు ఎలా సెల్ఫీలతో ఎంజాయ్ చేస్తున్నారో. బ్రిటన్ లో డేంజరస్ లెవల్ క్రాసింగ్ లలో ఇది ఒకటి. ఈ ఫొటోలు ఆగస్టు 30 నాటివి. రైల్వే లెవల్ క్రాసింగ్ లపై ఫొటోల యావలో పడిన జనం సెల్ఫీలు తీసుకోవడం మానడం లేదు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇక్కడి సీసీ టీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు అధికారులు. డెర్బీషైర్ లోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ లెవల్ క్రాసింగ్ నిత్యం రైళ్ల ప్రయాణంతో బిజీగా ఉంటుంది. రోజూ 30 ట్రైన్స్ వరకూ ఈ లెవల్ క్రాసింగ్ ద్వారా వెళ్తుంటాయని చెబుతున్నారు రైల్వే అధికారులు. అయినా .. లెవల్ క్రాస్ దాటి వెళ్లేటప్పుడు చిన్నా… పెద్ద తేడాలేకుండా అందరూ సెల్ఫీల మోజులో పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు దిగుతూనో… మెసేజ్ లు చేస్తూనో లెవల్ క్రాస్ చేస్తున్నారని… దీనివల్ల ట్రైన్ వచ్చేది గమనించడం లేదని చెబుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల బ్రిటన్ లో ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్టు.. గాయపడుతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ట్రైన్ వచ్చే టైంలో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేయటం ఆందోళన కలిగించే అంశం అని అక్కడి రైల్వే అధికారులు నెత్తీ, నోరూ బాదుకున్నా.. ఫలితం ఉండటం లేదు.

2DCC7DAA00000578-3289753-image-m-36_1445856723588 2DCC7DCE00000578-3289753-image-m-37_1445856763853 2DCC7DB200000578-3289753-image-m-38_1445856810786 2DCC7DC600000578-3289753-image-m-53_1445857236553

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy