రయ్ రయ్ మంటూ.. బెస్ట్ ఫ్రెండ్ తో చెర్రీ

ramcharanమెగా హీరో రామ్ చరణ్.. ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో  చెర్రీ తన పాత స్నేహితుడితో ఎంజాయ్‌ చేస్తున్న వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. చెర్రీ సతీమణి ఉపాసన తన సోషల్‌ మీడియా పేజ్‌లో దీన్ని పోస్ట్‌ చేసింది. ఇంతకీ ఆ పాత స్నేహితుడు ఎవరనుకుంటున్నారా? మగధీరలో చరణ్‌ వాడిన గుర్రం. రామ్‌ చరణ్‌ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోతో పాటు ఓ వీడియోనూ కూడా పోస్ట్‌ చేసిన ఉపాసన ‘మిస్టర్‌.సి ఈ వారాంతాన్ని తన పాత స్నేహితుడితో గడుపుతున్నాడు’ అంటూ కామెంట్‌ చేసింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy