రవితేజ, సురేందర్ రెడ్డిల మూవీ ‘కిక్-2’ కాదా..!

afkja;fjaమాస్ హీరో రవితేజ సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో మరో మూవీ రానుంది. ఇప్పటికే కిక్ తో భారీ హిట్ కొట్టిన ఈ టీం మరో మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ మూవీకి నిర్మాతగా మారారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఈ మూవీని ఎనౌన్స్ చేశారు. అయితే అంతా అనుకున్నట్లు ఈ మూవీ పేరు కిక్-2 కాదన్నారు కళ్యాణ్ రామ్.

ఇప్పటికే రేసుగుర్రం మూవీతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా మూవీని స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు కళ్యాణ్ రామ్. ఈ మూవీ పేరు కిక్-2 కాదని..త్వరలోనే మూవీ పేరును ఎనౌన్స్ చేస్తామన్నారు. రవితేజ- సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గతంలో వచ్చిక కిక్ కంటే ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందన్నారు. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామన్నారు. ఇది కిక్ మూవీకి సీక్వెల్ కాదని మరో సారి చెప్పారు కళ్యాణ్ రామ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy