రవితేజ సెకండ్ ఇన్నింగ్స్

ravi teja second inningsరవితేజ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నాడా.. ఇక నుంచి హీరోయిజం మాత్రమే కాదు.. పెద్దరికం పాత్రలు కూడ పోషించటానికి రెడీ అయిపోయాడా.. యేజ్ తోపాటు.. అందుకు తగ్గట్టు పాత్రలు వేయాలని అనుకుంటున్నాడా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అవుననే సమాధానం చెబుతోంది. బెంగాల్ టైగర్ రిజల్ట్ అదే చెబుతున్నదని అంటున్నారు. మొన్నటికిమొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా తదుపరి సినిమాల గురించి చాలా ముక్తసరి సమాధానాలు మాత్రమే చెప్పాడు. అన్నీ డిస్కషన్స్ స్టేజ్ లోనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. దీనికితోడు వేణు శ్రీరాంతో దిల్ రాజు తీస్తున్న మూవీలో కూడా ఈ మాస్ మహారాజా కన్ఫామ్ అయినట్లు లేదు.. మునుపటి రవితేజను చూస్తేగానీ చెప్పలేను అన్నాడంట ఈ మెగా ప్రొడ్యూసర్. అందేకు ఇంట్లో కూర్చుని అదే పనిగా బరువు పెరుగుతున్నాడని కూడా టాక్. ఈ వయస్సులో ఇన్ని కష్టాలు ఎందుకోగానీ.. నాగార్జున, వెంకీలా వయస్సుకు తగిన పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నాడంట. తన కెరీర్ పై ఈ విషయాలను తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు ఇండస్ట్రీలో టాక్. తన గురువుగా భావించే అమితాబ్ బచ్చన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారని.. తను కూడా ఆ రూట్ లో వెళితే ఎలా ఉంటుందనే సలహాలు, సూచనలను కూడా సన్నిహితుల డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని భావిస్తున్నాడంట.. లేటెస్ట్ గా జగపతిబాబును ఎగ్జాంపుల్ గా తీసుకుని.. నిర్మాతలు నష్టపోకుండా తనకు తగ్గట్టు పాత్రలతోనే తెరపైకి రావాలని భావిస్తున్నాడీ మాస్ మహారాజా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా మారితే హిట్.. ఫట్ టెన్షన్ ఉండదు.. రెమ్యునరేషన్ భారం కాదు అనే ఆలోచనకు వచ్చేశాడంట.. ఇన్ని రకాల ఈక్వేషన్స్ తో రవితేజ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కోడైకూస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy