రష్యన్ S – 400.. భారత్ కు వచ్చేస్తోంది

thediplomat_2015-04-22_14-35-18-553x360

 

భారత సైన్యం మరింత బలపడనుంది. సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ వచ్చి చేరనుంది. రష్యన్‌ ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ విక్రయ ఒప్పందంపై భారత్‌, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నాయి. ఎస్‌-400 ట్రయంప్‌ లాంగ్‌రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణి వ్యవస్థ అత్యంత శక్తిమంతమైంది. ఆకాశంలో 400 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే శత్రుదేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్‌లను నాశనం చేయగలదు. దీంతో మొత్తం మూడు క్షిపణులను ప్రయోగించవచ్చు. ఒకేసారి 36 లక్ష్యాలకు గురిపెట్టగలదు. ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు గురించి చర్చలు సాగుతున్నాయి. సంబంధిత చర్చలు చివరి దశకు చేరుకున్నట్టు రష్యా రక్షణ, పరిశ్రమల బృందం (రోస్‌టెక్‌) డైరెక్టర్  విక్టర్‌ ఎన్‌ క్లదోవ్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం భారత్‌ ఎన్ని ఎస్‌-400లను కొనుగోలు చేస్తుందన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయని విక్టర్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎస్‌-400ను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణనిచ్చేందుకు రెండేళ్లు పడుతుందని అప్పుడే వీటిని ఉపయోగించగలరని క్లదోవ్‌ తెలిపారు.

రష్యా నుంచి ఐదు బిలియన్‌ డాలర్లతో ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కొనుగోలు చేస్తామని గతేడాది అక్టోబర్‌లో భారత్‌ ప్రకటించింది. దాంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్‌ హెలికాఫ్టర్ల తయారీ చేపడతాయని పేర్కొంది. గోవాలో బ్రిక్స్‌ దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చించిన తర్వాత ఈ ఒప్పందం గురించి ప్రకటించారు. ఈ ఒప్పందం కుదిరి ఎస్‌-400లు భారత్‌ చేరితే ఆసియా ప్రాంతీయ రాజకీయాల్లో ఇదొక కీలక మలుపు అవనుంది. చైనా, పాకిస్థాన్‌ల భారత్ వైఖరిపై పెను మార్పులు సంభవించవచ్చు . శత్రుదేశాల క్షిపణుల నుంచి దేశంలోని ముఖ్య నగరాలు నాశనం కాకుండా రక్షణ ఛత్రం ఏర్పాటు చేయవచ్చు. ఇలాటి వ్యవస్థ అమెరికా వద్ద  కూడా లేకపోవటం భారత్ కు కలసి వచ్చే అంశం.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy