రహదారులతోనే అభివృద్ధి సాధ్యం: గడ్కరీ

01రహదారుల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వరంగల్ జిల్లా మడిగొండలో 163వ జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన సీఎం కేసీఆర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఏటూరునాగరం మండలం ముళ్లకట్టు దగ్గర గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు రూ.16 వేల 5 వందల కోట్లు కేటాయించామన్నారు. బెంగళూరు-హైదరాబాద్ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి  పర్మిషన్ ఇస్తున్నామన్నారు. భద్రాచలం-కౌటాల వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి జలమార్గ ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి సహకరిస్తామన్నారు. తెలంగాణ పూర్తిస్థాయి అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు గడ్కరీ.

03తెలంగాణకు కేంద్రం ఆశీస్సులు ఉండాలి: కేసీఆర్‌

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో మరో అతిపెద్ద నగరం వరంగల్‌ అని తెలిపారు. రాష్ట్రానికి 1800 కి.మీ. మేర రహదారులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆయనను ఎప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు.

కొత్త ఏడాదిలో జిల్లాల్లో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. వరంగల్ లో పర్యటిస్తున్నారు. రాత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేయనున్న సీఎం …  రేపు ఉదయం గణపురం మండలంలోని చెల్పూర్ KTPP చేరుకుంటారు. రెండోదశలో చేపట్టిన 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం రెండుగంటలకు జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టరేట్ లో అధికారులతో  సమీక్ష చేస్తారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy