రాంచరణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా

download (2)త్రివిక్రమ్ త్వరలో మరో మెగా హీరో ను డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే మెగా హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు తీసిన ఈ మాటల మాంత్రికుడు, నెక్స్ట్ రాంచరణ్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. త్రివిక్రమ్ పుట్టినరోజు సంధర్భంగా బర్త్ డే విషెస్ చెప్తూ…రాంచరణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలోనే ఓ మూవీ రాబోతుందంటూ ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ ఇది వరకే చరణ్ ‘పెప్సీ’ యాడ్ ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా త్రివిక్రమ్-మెగా ఫ్యామిలీ కాంబినేషన్లో రానున్న ఐదో సినిమా.  బండ్ల గణేష్ రీసెంట్ గా రాం చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy