‘యుద్ధం శరణం’ సాంగ్ రిలీజ్ : రాఖీ కట్టించుకున్న హీరో నాగచైతన్య

NAGAఅక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘యుద్ధం శరణం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సోమవారం (ఆగస్టు-7) రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ‘అక్క చెల్లెల్లకు రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అమ్మా నాన్నల తరువాత వాళ్ల బాధ్యత అన్నా తమ్ముళ్లదే అని’  అంటూ రేవతి చెప్పిన హార్ట్ టచింగ్ డైలాగ్స్ తో మొదలైన ఈ సాంగ్ కు శ్రేష్ట సాహిత్యం అందించగా ప్రదీప్ కుమార్ పాడారు.

వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy