రాగి, మట్టి పాత్రలకు డిమాండ్

kitchenకెమికల్ ప్రపంచానికి దూరంగా.. పూర్వపు అలవాట్లకు దగ్గరవుతున్నారు  సిటీజనం. ఆరోగ్యం మీద అవేర్నెస్ పెరగడంతో.. సాంప్రదాయపు అలవాట్ల వైపు మళ్లుతున్నారు. దీంతో సిటీలో రాగి, మట్టి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. రాగి, మట్టి పాత్రల్లో తినడం.. తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు డాక్టర్లు.హైదరాబాద్ లో రాగి… మట్టి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది.  వీటిని అమ్మే షాపులు సిటీలో తక్కువే ఉన్నా.. ఆన్ లైన్ లో మాత్రం ఈజీగా దొరుకుతున్నాయి.  అన్నం.. కూర వండే పాత్రల నుంచి.. వాటర్ తాగే బాటిల్ వరకు అన్నీ మట్టిలోనే ఉన్నాయి. జార్స్, టీ కప్స్, గ్లాసు, ప్లేట్లు, పెనం, మూకుడు.. ఇలా ఒకటేంటి అన్నీ మట్టి పాత్రలే.  వీటిలో వంట చేస్కోవడం.. ఆరోగ్యానికి మంచిదనే తీస్కుంటున్నాం అంటున్నారు.

మట్టిపాత్రల ధరలు అందుబాటులోనే ఉన్నాయంటున్నారు వ్యాపారులు. రెండు, మూడేండ్ల నుంచి జనంలో బాగా అవేర్నెస్ పెరిగింది.  గాజు వస్తువులకు పెట్టే  ధరలో సగానికే మట్టి పాత్రలు లభిస్తున్నాయి.  గ్యాస్  మీద మామూలు పాత్రల్లాగే వండుకోవచ్చంటున్నారు వ్యాపారులు.  బాక్టీరియాను ఆబ్జర్బ్ చేస్కునే శక్తి మట్టి పాత్రలకు ఉందంటున్నారు డాక్టర్లు. మట్టి పాత్రల్లో వంట చేస్తే… ఆహార పదార్ధాలు త్వరగా జీర్ణమవుతాయి.  మట్టి పాత్రలతో.. ఎట్లాంటి హాని లేకపోగా పోషకాలు కూడా తగ్గకుండా వందశాతం అలాగే ఉంటాయంటున్నారు డాక్టర్లు.

రాగి పాత్రలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది.  ప్లాస్టిక్ బాటిల్స్ హానికరం అని అవేర్నెస్ పెరగడంతో.. మళ్లీ పాత పద్దతులను ఓన్ చేస్కుంటున్నారు సిటీ జనం. తాజాగా మార్కెట్లోకి వచ్చిన కాపర్ వాటర్ బాటిల్స్ ను సిటీ పబ్లిక్.. బాగా వాడుతున్నారు.రాగిపాత్రల సేల్స్ కూడా బాగున్నాయంటున్నరు వ్యాపారులు. ఇందుల నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు డాక్టర్లు. జీర్ణశక్తి పెరిగి.. హెల్దీగా ఉంటారంటున్నారు. ప్లాస్టిక్ ని తరమాలంటే.. రెండు జనరేషన్స్ వెనక్కి వెళ్లక తప్పదంటున్నారు పర్యావరణ వేత్తలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy