రాజకీయంగా ఎదుర్కోలేకే ఫేక్ నోటీసులు: జూపల్లి

jupallyఅప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎలా అవుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తన కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై CBI నోటీసులు పంపించిందని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.CBI నోటీసు అంటూ ఫేక్ నోటీసులు సృష్టించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అసలు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.  ప్రుడెన్షియల్ బ్యాంకులో రూ. 6 కోట్ల రుణం తీసుకొని వడ్డీతో సహా చెల్లించామన్నారు జూపల్లి. చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నామన్నారు. తన పిల్లలు ఎవరిపైనా ఆధారపడకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం సహజమని… తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నామని  స్పష్టం చేశారు. గ్యారంటీ ఉన్నప్పుడు బ్యాంకులు ఖచ్చితంగా వసూలు చేస్తాయని మంత్రి తెలిపారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అందుకే తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారన్నారు. తనను నీరవ్ మోడీతో పోల్చడానికి కాంగ్రెస్ నేతలను సిగ్గుండాలని మంత్రి అన్నారు. తన పిల్లల ప్రతిష్టను దెబ్బతీసి వాళ్లు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్నారు. పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమన్న మంత్రి… ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని తాను వదులుకున్నానని గుర్తు చేశారు. ఇసుక మాఫియా గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దారుణమన్న జూపల్లి… మందిని ముంచిన కాంగ్రెస్ నేతలే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy