రాజకీయ పార్టీలతో రేపు EC  సమావేశం

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఇందులో భాగంగా గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీలతో రేపు(శుక్రవారం) సమావేశం కానున్నారు సీఈవో రజత్ కుమార్. దీనిపై అన్ని పార్టీల ఆఫీసులకు సమాచారం ఇచ్చింది సీఈవో కార్యాలయం. ఇప్పటికే ఎన్నికల ప్రచార సరళిపై నిఘా వేసిన ఎలక్షన్ కమిషన్.. పార్టీలకు కొన్ని సూచనలు చేయనుంది. నామినేషన్ ప్రొసీజర్ తో పాటు ఎన్నికల సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరనున్నారు రజత్ కుమార్.

నామినేషన్ వేసేప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా తమపై ఉన్న క్రిమినల్ కేసులు, నేరచరిత్రను తెలియజేయాలన్నారు తమపై ఉన్న కేసుల వివరాలను అభ్యర్థులు మీడియాకు ప్రకటనల రూపంలో ఇవ్వాలన్నారు. పోటీ చేస్తున్న ప్రాంతంలో ప్రజాదరణ పొందిన మూడు దినపత్రికల్లో క్యాండిడేట్లు డిక్లరేషన్ రూపంలో ప్రకటన ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తమను బలపరుస్తున్న పార్టీలకు కూడా అభ్యర్థులు తమపై ఉన్న  క్రిమినల్ కేసులు, నేరచరిత్ర సమాచారాన్ని ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ  అభ్యర్థుల నేరచరిత్రను పార్టీ వెబ్ సైట్ లో పొందుపర్చాలని సూచించారు రజత్ కుమార్.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy