రాజకీయ సమస్యగా ‘పడక గది ముచ్చట్లు’

49మనదేశంలో రైతుల ఆత్మహత్యలు, దళితుల సమస్యలు… రాజకీయ పీఠాలను కదిపేస్తుంటాయి. కానీ స్వీడన్ లో మాత్రం కాస్త తేడాగా ఉంది. దంపతుల పడక సుఖం అక్కడి ప్రభుత్వాధినేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ దేశస్థులు పడక సుఖం మర్చిపోతున్నారట. గత 20 ఏళ్లలో పడక గది ముచ్చట్లు మాట్లాడుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనిపై రాజకీయంగా అక్కడ రాజకీయ దుమారమే చెలరేగుతోంది. ఎందుకు ఇలా అవుతుందనే దానిపై సర్వేకు ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం.  మూడేళ్లు టైమ్ కూడా ఇచ్చింది. “ఒకప్పుడు సెక్స్ అంటే నెగిటీవ్ గా ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడది రాజకీయ సమస్యగా మారిందని.. చర్చింకచ తప్పడం లేదు” అన్నారు ఆ దేశ ఆరోగ్యశాఖమంత్రి విక్ స్టార్మ్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy