రాజశేఖర్ ‘గరుడ వేగ’ టీజర్

garudvegaహీరో రాజశేఖర్ కెరీర్ లోనే  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గరుడ వేగ సినిమా శుక్రవారం (సెప్టెంబర్22) టీజర్ రిలీజ్ అయ్యింది. నేషనల్ అవార్డుగ్రహీత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో  శ్రద్ధా దాస్, పూజా కుమార్, అలీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శివాని శివాత్మిక మూవీస్, జ్యోస్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను  నిర్మించారు.

సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ చూస్తే, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందినట్టు అర్థమవుతోంది. అలాగే వీఎఫ్ఎక్స్ వినియోగం కూడా అధికంగానే వున్నట్టు స్పష్టమవుతోంది. తాను ఓ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా కెరీర్‌లో మళ్లీ తనకి పాత రోజులు తీసుకొస్తుందని హీరో రాజశేఖర్ బలంగా నమ్ముతున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy