రాజశేఖర్ తో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్

rajasekhar-sunnyleone‘గరుడ వేగ’ సినిమాతో మరోసారి రాజశేఖర్‌ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్‌’ చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘కరెంటు తీగ’లో నటించిన సన్నీ లియోన్‌ ‘గరుడ వేగ’లో ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ముంబై ఫిలింసిటీలో ఈ పాట కోసం భారీ సెట్‌ వేశారు. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఈ స్పెషల్‌ సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy