రాజా లైట్ తీసుకొన్నాడు : 2G కేసులో 17మందికి హైకోర్టు సమన్లు

YTU2జీ కేసులో మాజీ కేంద్ర మంత్రి ఏ. రాజా, డీఎంకే ఎంపీ కనిమోళితో పాటుగా 17 మందికి ఢిల్లీ హైకోర్టు ఈ రోజు(మార్చి21) నోటీసులు జారీ చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో సీబీఐ సరైన సాక్యాలు సమర్పించడంలో విఫలమవడంతో 2017 డిసెంబర్ 21 న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఆ కేసులో మళ్లీ సీబీఐతో పాటు ఈడీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. 2జీ కేసులో తాము సరైన ఆధారాలు ఇచ్చినప్పటికీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సరిగా లేదని సీబీఐ తెలిపింది. అయితే ఈ రోజు కోర్టు నోటీసులపై స్పందిన రాజా..  ఇందులో ప్రత్యేకమేమి లేదని, ఇది చాలా సాధారణమన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy