రాజీవ్ సద్భావన యాత్ర..25 ఏళ్ల వసంతం

ING-191015-HYD-RAJIVSADBAVANAహైదరాబాద్ చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సిల్వర్ జూబ్లీని జరుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఆజాద్ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి, మాజీ ఎంపీలు వివేక్, పొన్నం, మాజీ మంత్రులు గీతారెడ్డి, వినోద్ అటెండయ్యారు. 1990 అక్టోబర్ 19న ప్రజలంతా సద్భావనతో ఉండాలని… హైదరాబాద్ లో సద్భావన యాత్రను రాజీవ్ గాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా కాంగ్రెస్ నేతలు సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ING-191015-HYD-RAJIVSADBAVANA1దేశంలో హిందూ, ముస్లింలు కలిసిపోయే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలన్నారు నేతలు. కాంగ్రెస్ అందరినీ కలుపుతుందని…. మిగిలిన పార్టీలు మత ఘర్షణలు పెంచేందుకు ndaపై పరోక్షంగా విమర్శలు చేశారు.  ప్రజలంతా సెక్యులర్లు కాబట్టే… కొన్ని మతతత్వ పార్టీలు గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా దేశంలో శాంతి ఉందన్నారు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్. రాజకీయ పార్టీలు గెలవొచ్చు, ఓడొచ్చు,..కానీ శాంతి విషయంలో ప్రజలు గెలవాలన్నారు. కాంగ్రెస్ ఇన్ చార్జ్ దిగ్విజయ్ చేతుల మీదుగా.. రాజీవ్ సద్భావన అవార్డును ఆజాద్ అందుకున్నారు. రాజీవ్ గాంధీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మీటింగ్ తర్వాత ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా సందర్శించారు ఆజాద్. ఆయనకు నివాళులు అర్పించారు. కాకా లాంటి నేతల వల్లే కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు ఆజాద్. సద్భావన యాత్ర సందర్భంగా రాజీవ్ గాంధీని నివాళులు అర్పించడంతో పాటు.. బల్దియా ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేశారు నేతలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy