రాజీ దిశగా సుప్రీం జడ్జీల వివాదం

judgessసుప్రీంకోర్టు జడ్జీల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఒకవైపు, బార్ అసోసియేషన్ ఇంకోవైపు, సుప్రీంకోర్టు ఇతర జడ్జీలు మరోవైపు… వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

సుప్రీం జడ్జీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతోంది. రెబెల్ గా మారిన నలుగురు జడ్జీలకు పెద్దగా వ్యవహరిస్తున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఏడుగురు ప్రతినిధుల బృందం కలిసింది. మరో రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీటింగ్ తర్వాత బార్ కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. సుప్రీంకోర్టులో సంక్షోభమేమీ లేదన్నారు.

చలమేశ్వర్ తో బార్ కౌన్సిల్ మీటింగ్ అయిపోగానే… ఆయన ఇంటికి జస్టిస్ బాబ్డే, జస్టిస్ L నాగేశ్వర్ రావులు వెళ్లారు. తర్వాత బార్ కౌన్సిల్ ప్రతినిధులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఇళకు వెళ్లి వారితో మాట్లాడారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను కూడా అపాయింట్ మెంట్ కోరింది బార్ కౌన్సిల్. ఇక సమస్యలను 10రోజుల్లో పరిష్కరించుకోవాలని జడ్జీలకు సూచించింది బార్ అసోసియేషన్. అలా చేయకపోతే… ప్రజల్లోకి వెళ్తామన్నారు బార్ అసోసియేషన్ ప్రతినిధులు.

సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసును విచారిస్తూ ఆకస్మికంగా చనిపోయిన CBI కోర్ట్ జడ్జి BH లోయా మృతిపై రాజకీయాలు చేయడంపై ఫ్యామిలీ సీరియస్ అయింది. తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయొద్దని పార్టీలను కోరారు అతని కొడుకు అనూజ్ లోయా.

మరోవైపు కేసుల కేటాయింపు విషయంలో హేతుబద్దంగా, పారదర్శకంగా వ్యవహరించాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు రిటైర్డ్ జడ్జీలు లెటర్ రాశారు. అధికారం దుర్వినియోగం చేయొద్దని జస్టిస్ PB సావంత్, AP షా, K చంద్రు, H సురేష్ లు బహిరంగ లేఖ విడుదల చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy