‘రాజుగారి గది 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

17457683_10154354601888309_4969809657576641043_nటాలీవుడ్ స్టిల్ బ్యాచిలర్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజుగారి గది 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. యంగ్ డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. PVP సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్ కి చేరిందని టీం వెల్లడించింది. ‘రాజుగారి గది’లా.. వైవిధ్యమైన కథ,కథనాలతో సాగే చిత్రమిది. నాగార్జునను ఓ కొత్తతరహా పాత్రలో చూడబోతున్నారు. ఆయన పాత్రతో పాటు చాలా షాకింగ్‌ అంశాలు ఈ గదిలో ఉండబోతున్నాయి’ అని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నాగ్ సరసన అందాల భామ (రన్ రాజా రన్ ఫేం) సీరత్‌కపూర్‌  హీరోయిన్ గా నటిస్తుండగా.. సమంత ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో త్వరలోనే విడుదల చేయనున్నారట.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy