రాజ్యసభకు అమిత్‌షా

amit shahబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తొలిసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి రంగం సిద్ధమైంది. గుజరాత్‌లో ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది. అమిత్‌షా ప్రసుత్తం గుజరాత్‌ శాసనసభ్యుడిగా ఉన్నారు. అమిత్‌షా ఎమ్మెల్యేగా ఉండడం కన్న పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తేనే సముచితంగా ఉంటుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు భావించింది.

బీజేపీ నిబంధనావళి ప్రకారం ఒక వ్యక్తి మూడేళ్ల చొప్పున రెండు పర్యాయాలు వరుసగా పార్టీ అధ్యక్షుడిగా ఉండొచ్చు. అమిత్‌షా 2014 జులైలో తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరిలో పార్టీ సంస్థాగత ఎన్నికల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 జనవరి దాకా ఆయన ఆ పదవీలో కొనసాగుతారు. ఆ తర్వాత కూడా ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోసారి ఎన్నికయితే 2022వరకు అధ్యక్షుడిగానే ఉంటారు. జాతీయ అధ్యక్షుడిగా ఉండే ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తేనే హుందాగా ఉంటుందని పార్టీ భావించింది. అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మంత్రిగా కొనసాగడం ఉండదు కాబట్టి అప్పటి వరకు ఆయన మంత్రివర్గంలో చేరే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షాను రాజ్యసభకు తీసుకువస్తుండడం ద్వారా ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వెళ్తారన్న ఊ­హాగానాలకు తెరపడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy