రాజ్యసభలో టీడీపీ ఎంపీల దౌర్జన్యం

cm ranesh
రాజ్యసభలో టీ బిల్లు ఈరోజు ప్రవేశపెడతారన్న నేపథ్యంలో సభ ప్రారంభం నుంచే గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే మొదటిసారి వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు, నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. సభ జరగకుండా అడ్డుకున్నారు. ఏకంగా రాజ్యసభ అధికారిపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారు టీడీపీ సీమాంధ్ర ఎంపీలు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ సంషేర్ షరీఫ్ నుంచి పేపర్లు లాక్కునేందుకు ప్రయత్నించారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. దానిలో భాగంగా సెక్రటరీ జనరల్ పై దాడికి యత్నించారు. సీఎం రమేష్ దాడి చేస్తున్న సమయంలో అదే పార్టీకి చెందిన మరో నేత సుధారాణి ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సీఎం రమేష్ తీరుపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం రమేష్ ఆయనతో కూడా వాగ్వాదానికి దిగరు. అనంతరం రాజ్యసభను మధ్యాహ్సం రెండు గంటలకు వాయిదా వేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy