రాజ్యసభలో పోలవరం బిల్లు అడ్డుకోండి..!

ktr imageరాజ్యసభలోనైనా పోలవరం బిల్లును కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకోవాలన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని…సోనియా ఇంటి ముందు ధర్నా చేసైనా సరే బిల్లును అడ్డుకోవాలని ఆయన అన్నారు. ఎన్డీఏకి రాజ్యసభలో బలం లేదని…మందబలంతో లోక్ సభలో బిల్లును ఆమోదించారని ఆయన మండిపడ్డారు.

ఖమ్మం జిల్లా ప్రజలపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నట్లైతే బిల్లును అడ్డుకోవాలని…కాంగ్రెస్ తలచుకుంటే బిల్లు ఆగిపోతుందన్నారు. రేపు రాజ్యసభలో బిల్లును అడ్డుకోని కాంగ్రెస్ నేతలు తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు కేటీఆర్. తమ పార్టీకి రాజ్యసభలో ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారని…అయినా ఓటింగ్ కు డిమాండ్ చేస్తామన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా బిల్లును అడ్డుకోవాలని…ముగ్గురు ఎంపీలు ఇప్పటికైనా తెలంగాణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

రేపు ఓటింగ్ కు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయాలని…ఓటింగ్ తో ఎవరి రంగు ఎంటో బయటపడుతోందని కేటీఆర్ అన్నారు. పోలవరం నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని..తెలంగాణ భూములు ముంచుతూ ఆంధ్రాకు నీరివ్వడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా..ప్రభుత్వంలో ఉన్నా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ మాత్రమే పోరాడిందని కేటీఆర్ తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy