రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత చైర్మన్ వెంకయ్యనాయుడు డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ నిర్వహించారు. జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ కు 125 ఓట్లు… విపక్ష పార్టీల అభ్యర్థి , ఎంపీ బీకే హరిప్రసాద్ కు 105 ఓట్లు వచ్చాయి. దీంతో… హరివంశ్ నారాయణ్  కొత్త డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైనట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఓటింగ్ సందర్భంగా బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సహా… బీజేపీ ఎంపీలంతా రాజ్యసభకు హాజరయ్యారు. ఎన్డీయే పక్షాల మద్దతుతో తమ అభ్యర్థిని బీజేపీ గెలిపించుకుంది. ఓటింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిగేందుకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభను సజావుగా నడపడంలో హరివంశ్ సమర్ధతను చూపుతారని ఆకాంక్షించారు ప్రధాని మోడీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy