
నీట్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వివరణ ఇచ్చారు. నీట్ పరీక్షతో అక్రమాలు, అవినీతిని అరికట్టవచ్చని ఆయన సభకు తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలను పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే నీట్ బిల్లులో మార్పులు చేర్పులు చేశామన్న ఆయన ఇకపై ఈ బిల్లుతో విద్యార్థులు అనేక కష్టాల నుంచి బయటపడుతారని వెల్లడించారు. ఈ బిల్లు ద్వారా వివిధ రకాల మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు చెక్ పెట్టనున్నామని నడ్డా సభకు తెలిపారు.
అయితే ఈ బిల్లును అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేకించింది. బిల్లు పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని మండిపడింది. నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో అన్నాడీఎంకే ఎంపీలు అడ్డుతగిలారు.